అష్టాదశ పురాణాలలో వ్యసకృత శ్రీ మద్భాగవతం వాసుదేవ కదా కలశ రత్నాకరం. భాగవతం అంటే భగవంతుని గూర్చి వివరించే గ్రంథమని భావం. అలాగే భగవత్ శబ్దంతో సంబంధించిన పేరుగల గ్రంధం భగవద్గీత. భగవంతుడు చెప్పింది భగవద్గీత  ఆ భగవద్గీత  గురించి చెప్పేదే భాగవతం. ఈ రెండూ మహా గ్రంధాలకు గల వేదదీయలేని సంబంధం ఇది. భాగవతం పరతత్వము యొక్క విభూతిని సాహిత్య రూపంలో భోధించే గ్రంధం. ఇంత మహాత్తుగల మహాభాగావతాని బొమ్మెర పోతన కవి ఆంధ్రీకరించాడు. తెలుగు వారి నిత్య జీవితంలో పోతన భాగవతం పెనువేసుకుపోయింది. అది ఆబాల గోపాలానికి నిత్యపారాయణ గ్రంధం. పడిత పామర రసనాలపై నాత్యమాడుతుందే రసఝురి "ఎవ్వనిచే జనించు... అలవైకుంఠపురంబులో ..."వంటి పద్యాలు తెలుగు వారి నాలుకలకు మందార మకరంద మాదుర్యాలుగా నిలిచి పోయేటట్లు చేసిన మహా మహితాత్ముడు పోతన . పోతన కవిత్వంలో లయాత్మకత తో కూడిన శబ్ద మాధుర్యం, పద్యాలలో చొప్పించిన భక్తీ పారవస్యాతలవల్ల భాగవతం తెలుగువారి నిత్య పారాయణ గ్రంధం అయింది. భక్తితో పతించు వారికి కూడా పునర్జన్మ లేకుండా చేసిన మహాపురాణం ఇది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good