శ్రీ స్వామి వారి ఆదేశం ప్రకారం దశమహావిద్యలు అనే పేరుతొ పది దేవతలకు సంబంధించి పది పుస్తకాలు వెలువరించాలని ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. ఆ ప్రణాళికలో భాగంగా తొమ్మిదవ  గ్రంధమైన శ్రీ మాతంగీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా , శ్రీ మాతంగీ దేవి గురించి, వివిధ రకాలైన శ్రీ మాతంగీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్దతుల గురించి,శ్రీ మాతంగీ అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నారు.ఈ సంకలనంలో సాధనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వీలైనంత సమగ్రంగా ఇచ్చే ప్రయత్నం చేసారు. మరిన్ని వివరాలు కావాలనుకునే సాధకులు మంత్రం మహార్ణవం , మంత్రం మహోదధి, శారదా తిలకం గ్రంధాలను పరిశీలించవచ్చు
మరకతశ్యామ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీ దేవి దశామహావిద్యాలలో తొమ్మిదవ మహావిద్య వశీకరణదేవతగా ప్రశస్తి పొందిన మాతంగీ దేవికి వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయా తిది ప్రీతి పాత్రమైనది. రాజమాతంగీ , లఘు శ్యామలా , ఉచ్చిష్టచండాలి, అనే పేర్లుతో కూడా ఈ దేవిని వ్యవహరిస్తారు. ఈ దివ్య స్వరూపిణి ఉపాసనవల్ల వాక్స్ ద్ది సకల రాజ శ్రీ పురుష వశీకరణాశక్తి , ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good