భారతీయ సంకృతి , నాగరికత, చరిత్రలను గురించిన సంపూర్ణ జ్ఞానం కోసం, పురాణ అధ్యయనం తప్పనిసరి. పురాణాలు ఈ ప్రాచీన దేశపు సంకృతి, ఆచార వ్యవహారాలు, నాగరికత, చరిత్రలను గురించి తెలిపే కొలదండాలు, వీటిని క్షుణంగా తెలుసుకొనని ఎటువంటి అధ్యయనమైనా, భారతదేశానికి సంబంధించినంత వరకు అసంపూర్ణమే. కృష్ణ ద్వైపాయన వేదవ్యాస మహర్షి కృతమైన భారతీయ పురాణ సాహిత్యం అంటే అష్టాదశ (18) మహాపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలు గల మొత్తం సాహిత్యం, అష్టాదశ మహాపురాణాలలోను 15 వ పురాణం శ్రీ కూర్మమహాపురాణం. సుమారు 6000 పైగా శ్లోకాలుగల ఈ పురాణం, పురాణాలన్నింటి లోకి అతి చిన్నది. ఈ నాటి వరకు సంపూర్ణంగా వచన రూపంలోకి రాలేదు, ధర్మ , అర్ధ , కామ, మోక్ష, ప్రతిపాదకమైన ఈ పురాణం ఇప్పుడు తేట తెలుగు వచనంలోని తీసుకొని రాబడింది . కూర్మ పురాణ సంస్కృత గ్రంధం కూడా తెలుగు వారి చేతనే 1875 లో తొలిసారిగా తెలుగు లిపిలో ప్రచురించబడింది. ఈనాడు తిరిగి వచనంలో తొలిసారిగా సంపూర్ణంగా వస్తున్న ఈ శ్రీ కూర్మ మహాపురాణం తెలుగు వారి ప్రతి గృహాన్ని అలంకరించాలని మా ఆకాంక్ష . 

Write a review

Note: HTML is not translated!
Bad           Good