ఈ పుస్తకం ద్వారా శ్రీ చిన్న మస్తా దేవి గురించి, వివిధ రకాలైన చిన్నమస్తా మంత్రాలు గురించి, వాటి సాధనా పద్దతుల గురించి, శ్రీ చిన్న మస్తా అష్టోతర , సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రందాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాను. సాధకులు దశ మహావిద్యలలోని ఏ దేవత మంత్రాన్నేనా ఉపదేశం పొందాలనుకున్నా, వీటి సాధనలో ఏమైనా సందేహాలు, సంశయాలు, కలిగినా మంత్రశాస్త్ర మహారధి దశమహావిద్యా సిద్దిపురుశులైన కుర్తాళం పీఠాదిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి వారిని స్వయంగా సంప్రదించి తమ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.
దశమః విద్యలలో అరవ మహావిద్య శ్రీ చిన్న మస్తాదేవి ఈ దేవినే వజ్రవైరోచినీ, ప్రచండ చండీ అనికూడా అంటారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్ధి తిది ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శాక్తేయ సంప్రదాయంలో చిన్న మస్తాదేవికి ఏంటో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్ట తో ఉపాసిస్తే సరస్వతీ సిద్ది, శత్రు విజయం , రాజ్య ప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు , ఎటువంటి కష్టతరమైన కార్యాలనైన అవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good