శ్రీ స్వామి వారి ఆదేశం ప్రకారం దశమహావిద్యలు అనే పేరుతొ పది దేవతలకు సంబంధించి పది పుస్తకాలు వెలువరించాలని ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. ఆ ప్రణాళికలో భాగంగా నాల్గోవ గ్రంధమైనశ్రీ భువనేశ్వరి సాధన అనే ఈ పుస్తకం ద్వారా , శ్రీ భువనేశ్వరి దేవి గురించి, వివిధ రకాలైన భువనేశ్వరీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్దతుల గురించి, శ్రీ భువనేశ్వరి అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నారు.ఈ సంకలనంలో సాధనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వీలైనంత సమగ్రంగా ఇచ్చే ప్రయత్నం చేసారు. మరిన్ని వివరాలు కావాలనుకునే సాధకులు మంత్రం మహార్ణవం , మంత్రం మహోదధి, శారదా తిలకం గ్రంధాలను పరిశీలించవచ్చు. దశామహవిద్యలలో నాల్గోవ మహావిద్య శ్రీ భువనేశ్వరీ దేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతి తో ప్రకాశించే ఈ మాటకు భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిది ప్రీతి పాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి ఈ విద్యను ఉపాసిస్తే ఆ సాధకుడికి మూడోకన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు , రాజ్యాధికారాన్ని, సమస్తసిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. |