మహాపురాణాలు 18 అని వాటి పేర్లను ప్రధమాక్షరంతో చెప్పిన పట్టికలో భ తో ప్రారంభ మయ్యేవి రెండు మొదటిది భాగవతం , రెండవది భావిష్యపురానం , మనకు రెండు భాగవతాలు ఉన్నాయి. విష్ణు భాగవతం ఒకటి, దేవీ భాగవతం ఒకటి.పది పురాణాలు అని ప్రశ్నిస్తే ఎవరి వాదాలు వారికి ఉన్నాయి. ఇది ఒక ఎడతెగని చర్చ, ఎవరి నమ్మకాలు వారివి.
ఏమైనా తేలుగు వారిలో విష్ణు భాగవతానికి ఉన్నంత ప్రచారం దేవీ భాగవతానికి కూడా సమానంగా ఉన్నది.గత శాతాబ్దంన్నర కాలంలోనే సుమారు పదికి పైగా భాగవత తెలుగు గద్య పద్యానువాదాలు వచ్చాయిఅంటే ఆస్తికులలో ఆ గ్రంధ ఆదరణ అర్ధం చేసుకొనవచ్చును.
ప్రస్తుత దేవి భాగవతం 94 సంవత్సరాల కాలం జీవించిన ఈ మధ్యనే స్వర్గస్తురాలైన స్థానాపతి రుక్మిణమ్మ గారి వచనంలో వెలువడిన గ్రంధం యొక్క మూడవ ముద్రణ. ఒక పురాణ గ్రంధం అందులో వచనం మూడవ సారి ముద్రితం అయిందంటేనే ఆ గ్రంధం ప్రాశస్త్యం అవగాహన చేసుకొనవచ్చు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good