ఈ గ్రంథంలోని కథలన్నీ, ఒక లెఫ్టినెంట్‌ తులసి మినహాయిస్తే, తక్కినవన్నీ గ్రామీణుల భాసలో రాయబడ్డాయి. యీ రకం భాష రాయడం బహుకష్టం. ఆదిని కీర్తిశేషుడు గురజాడ అప్పారావుగారు రాశారు. యీనాడు రాస్తున్న యువకుల్లో గోఖలే, చాగంటి సోమయాజులు, యీ శిష్‌ట్లా సమర్థతతో రాయగలరు. గ్రామీణులైన సిపాయీల నోటిలోంచి వచ్చిన మాటలు తడారకుండా కథలలో చొప్పించుకున్నాడు రచయిత. ఏ రకం జీవితంలోనైనా రచయిత కలిసిపోయి, ఆ జీవితపు లోతుల(కు) పోగలగడం రచయితల కొక విశిష్టత. యిది అందరూ చేయగలిగిన పనికాదు.

Pages : 316

Write a review

Note: HTML is not translated!
Bad           Good