శంకరుల స్తోత్రాలు

        బ్రహ్మసూత్రాలు, గీత, ఉపనిషత్తులపై ఆది శంకరులు అద్వైతపరంగా వ్యాఖ్యానం చేసినట్లు జగత్ప్రసిద్ధం. వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి వంటి ప్రకరణ గ్రంథాలను స్వతంత్రంగా వ్రాసేరు.

         పరమాత్మయే సత్యమని, జగత్తు మిథ్యయని, జీవుడే పరబ్రహ్మయని చెప్పేది అద్వైతం. ఇది వేద సమ్మతమని నిరూపించారు.

         అయితే ఈ సిద్ధాంతం సామాన్య జనులకు అందుబాటులో ఉండదు కదా! బౌద్ధికంగా జీవ పరమాత్మలను తెలుసుకొని ప్రయోజనం ఏమిటి? శాంత మనస్కులమై దీనిని ఒంట పట్టించుకొనే స్థితిలో లేం. మనకు అనుభవంలో ఉన్నది ఈ జగత్తు. పరుగులెత్తే మనస్సుతో కాక స్తిమితమనస్కులకు మాత్రమే అద్వైతానుభూతి కల్గుతుంది. కనబడేదంతా భ్రాంతియనే భావన అంత చటుక్కున అనుభవంలోకి వస్తుందా? అట్టి అనుభవం రావడానికి సత్కర్మలు, అనుష్ఠానం, తద్వారా చిత్తశుద్ధి ఏర్పడగా అద్వైత సిద్ధి.

Pages : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good