అద్భుతంగా జీవించడానికే మీకీ జన్మ లభించింది

ఈ పుస్తకంలో మీకు ఒక అద్భుతమైన జీవితం గడిపే మార్గాన్ని చూపిస్తాను. జీవితాన్ని గురించి మీరు తెలుసుకోవలసింది ఎంతో వుంది. అదంతా మంచి గురించే. నిజానికి అది ''మంచి'' కన్న కూడ ఉన్నతమైనది, విలక్షణమైనది.

ఈ పుస్తకంలో మిమ్ముల్ని నేనొక అద్భుతమైన జీవితంలోకి నడిపిస్తాను. మిమ్ముల్ని గురించి, విశ్వాన్ని గురించి, మీలోనే వుండి మీకే తెలియని శక్తుల గురించి తెలియజేస్తాను. మీరనుకున్నదానికన్నా ఈ జీవితం మరింత సరళమైనది, సులభమైనది. జీవితగమనాన్ని గురించీ, మీలో ఉన్న శక్తి గురించీ తెలుసుకుంటున్న కొద్ది మీకు జీవితంలోని అద్భుతం అర్ధమౌతుంది. అప్పుడు మీకొక అద్భుతమైన జీవితం లభిస్తుంది.

ఇప్పుడిక ఆ అద్భుతంలోకి అడుగుపెట్టండి. - శక్తి నుంచి

Write a review

Note: HTML is not translated!
Bad           Good