నాటకాన్ని నవరసాలలో రంగరించి ఆవిష్కరించడంలో తన రచనా కౌశలంతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానందాలలో ఓలలాడించిన విశ్వవిఖ్యాత నాటకకర్త విలియమ్‌ షేక్స్‌పియర్‌.  1564 ఏప్రిల్‌ 23న లండన్‌కు 103 మైళ్ళ దూరంలోని స్టార్ట్‌ఫర్డ్‌ ఎవాన్‌ పట్టణంలో జన్మించారు.  1616 ఏప్రిల్‌ 23న మరణించారు.  తండ్రి చర్మపరిశ్రమకు చెందిన వ్యాపారి.  షేక్స్‌పియర్‌ నటుడు.  నాటకకర్త.  కవి. నాటకకర్తగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు.  మోదాంత, విషాదాంత, చారిత్రక నాటకాలను రచించారు.

ఈ అపురూప నాటక కథలులో షేక్స్‌పియర్‌ రచించిన వెన్నిస్‌ వర్తకుడు, కింగ్‌ లియర్‌, కవలల కలకలం, నడిరేయి మిడిమేలం, జూలియస్‌ సీజర్‌, మేక్బెత్‌ ఆరు నాటకాలను కథారూపంలో మీకు అందిస్తున్నారు.  ఈ ఆరూ సుప్రసిద్ధమయినవే.  ఆనంద ఆశ్చర్య వినోదాలతో పాటు లోకంలోని వివిధ రకాలయిన వ్యక్తులు, వారి గుణస్వభావాలు - ఆశ, లోభం, క్రోధం, మోహం, అహంకారం మనుషుల్ని ఎలా బలితీసుకుంటాయో ఈ కథల్లో ఆయా పాత్రలద్వారా మనకు తేటతెల్లమవుతుంది.

ఈ నాటక కథలను జివిఎల్‌ నరసింహారావు సరళంగా సుబోధకంగా తెలుగులో అనువదించి మీకు అందిస్తున్నారు. నరసింహారావు గతంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా పిల్లల కోసం 'నచ్చే మెచ్చే కథలు' నాలుగు సంపుటాలు, నూరు కథలతో 'కథాశతకం'ను అందించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good