ఈ కథలు చిన్నారులు తేలికగా చదవడానికి షేక్స్‌పియర్‌ గురించి తెలుసుకోవడానికి ఈ రచన క్లుప్తంగా ఉపయోగపడుతుంది. పాఠకులకు షేక్స్‌పియర్‌ రచనలు ఆంగ్లంలో చదవడానికి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సాధ్యమైనంత వివరంగా తెలుగీకరణ చేయడానికి కృషి చేయడం జరిగింది.

అన్నింటికీ మించి ఈ పుస్తకంలో చిత్రాల ద్వారా అప్పటి కాల్పనిక దృశ్యాలను కూడా చిన్నారి పాఠకులకు వివరించడం జరిగింది.

విలియం షేక్స్‌పియర్‌ (1564-1616) నాటక రచయిత, కవి. ప్రపంచంలోని నాటక రచయిత, కవి, ప్రపంచంలోని నాటక రచయితలలో మొదటివాడుగా, అగ్రగామిగా, గొప్పకవిగా పేరుగాంచాడు.

చమత్కారంలోనూ, విషాద సన్నివేశాల్లోనూ, కథావస్తువులోను అతనికి అతనే సాటి. చారిత్రాత్మక నాటకాలైన, హాస్యనాటికలైనా మొరటుతనాన్ని, హాస్యాన్ని, నాజుకుతనాన్ని పాత్రలను ఆకట్టుకునే విధంగా ఉంటాయి ఇతని రచనలు.

షేక్స్‌పియర్‌ రచనల్లోంచి కొన్ని నాటకాలను తెలుగు చిన్నారి పాఠకులకు అందించే చిరు ప్రయత్నమే ఈ 'షేక్స్‌పియర్‌  కథలు'' పుస్తకం.

Pages : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good