Rs.30.00
Out Of Stock
-
+
వాగనుశాసనుడు శ్రీశ్రీ
శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇంటిపేరు, తన పేరు రెండూ కూడా శ్రీకారంతో మొదలిడుతున్నాయి. శ్రీ అంటే అందరికీ తెలుసును. పూజా పునస్కారాలలో శ్రీకారం తప్పనిసరిగా ఆవృత్తి అవుతూ వుంటుంది. శ్రీకారం శుభదాయకం. కావ్యరచనకుద్యమించే కవి శ్రీకారంతో ప్రారంభించడం మన సంప్రదాయం. శ్రీకారంతో శ్రీశ్రీ జన్మించాడు. ఈ అదృష్టం శ్రీశ్రీకే దక్కింది. శ్రీశ్రీ కవిగా ప్రఖ్యాతి చెందిన తరువాత చాలామంది కవులు శ్రీశ్రీని వరవడిగా తీసుకొని శ్రీకారాన్ని స్వీకరించారు. ఇది శ్రీశ్రీ నామధేయంలోని ప్రత్యేకత.
పేజీలు : 31