Rs.60.00
In Stock
-
+
కన్యాశుల్కం ఒక అపూర్వ సృష్టి
- సెట్టి ఈశ్వరరావు
కన్యాశుల్కం ఆధునిక భాషా సాహిత్యాల అపూర్వ సృష్టి; అది వాటి ఆదికావ్యం కూడా.
ప్రజలెరగని సంస్కృతంలో కావ్యాలు రాయడం, చదవడం 11వ శతాబ్దం వరకూ అలవాటై వుండేది. ఆ అలవాటును వదిలి రాసిన మొట్టమొదటి తెలుగు మహాకావ్యం, ఆంధ్ర మహాభారతం. అంచేత పూర్వ భాషా సాహిత్యాల విషయంలో, అది అపూర్వ సృష్టి. ఆ వొరవడిలో, చిన్న చిన్న మార్పుల్తో, భాషా సాహిత్యాలు ఎనిమిది శతాబ్ధాలు సాగిపోయాయి.
ఈ చిరు పుస్తకంతోపాటు విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన ''కన్యాశుల్కం'' నాటకంమీద ఈశ్వరరావు గారు రాసిన ''కన్యాశుల్కం ఒక అపూర్వ సృష్టి'' అనే వ్యాసాన్ని సెట్టి ఈశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వినమ్రతతో పాఠకులకు అందిస్తుంది.
పేజీలు : 107