చక్రం పంక్చర్‌ అయి కారు ఆగిపోయినపుడు దాన్ని గురించి చికాకుపడితే అది సరిపోదుకదా?  అలాగే జీవితం గురించి కూడా విసుక్కుంటూ, చికాకుపడుతూ ఉండకూడదు.  ఉత్సాహంగా జీవితంలో ముందుకెళ్ళాలి.  మనం నిజాయితీగా ఉండడమే ఒక జాగృతి.  మనం స్వచ్ఛంగా, నిర్భయంగా ఉండాలి.
ఆశావాదం అంటే భయం లేక పోవడం కాదు.  నిర్భయంగా సమస్యలను ఎదుర్కొంటూ, వాటి మధ్య వుంటూనే పరిష్కారంపైన దృష్టి సారించాలి.  ఈ సందర్భంలో మనం అంతర్ముఖులం కావాలి.  మనస్సు ఆలోచనలకు కేంద్రం.  ఇక్కడే మన జీవితానికి సారం, సార్థకత, స్వచ్ఛత నిబిడీకృతమై వుంటాయి.
ప్రజలు దేశానికి పునాదిలాంటి వారు.  పునాది గట్టిగా, భద్రంగా వున్నపుడే దేశం శక్తివంతమౌతుంది.  ఆ పునాది మౌనంగా వుండాలి, అంటే శాంతంగా వుండాలి.
నిజమైన ఆత్మజ్ఞానం మౌనంలోనే వుంటుంది.  కానీ అది అర్థం అవటానికి చెవులకు భాష వినిపించాలి.  మనకు తెలిసీ ఆచరణలో పెట్టకపోవడం అజ్ఞానం.  ఈ అజ్ఞానాన్ని అమాయకత్వంలోనికి సులభంగా మార్చుకుంటారు జ్ఞానులు.
ఈ పుస్తకాన్ని నవలలా ఆసాంతం చదివెయ్యకండి.  అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా చదవండి.  అలా చేస్తున్నపుడు, మీరు చదువుతున్న అక్షరాలు, మాటలు మాయమైపోయి ఈ భావాల సారం మీ మనస్సుకు హత్తుకుపోతుంది.  పాము ఎంత పొడవుందీ అన్నదికాదు ముఖ్యం, దాని తల ఎక్కడుందో చూసి ఒడుపుగా పట్టుకోవాలి.
కొన్నిసార్లు మనం గెలిచినా ఓడిపోతాము.  ఓడిపోయి గెలుస్తాము.  జీవితంలోనికి మనం భయాన్ని ఆహ్వానించకూడదు.  సాహసాన్ని, ఆ సాహసంలోని శక్తిని ఆహ్వానించాలి.  అలా చేసినప్పుడు మీకే తెలియకుండా, మౌనంగా, నిశ్శబ్దంగా మీలో జ్ఞానం ప్రవహిస్తుంది. - స్వామీ సుఖబోధానంద

Write a review

Note: HTML is not translated!
Bad           Good