మనం మారటం అనేది మరింత 'మెరుగు'కోసం, మరింత 'మెరుపు' కోసం.

ఈ మెరుగులో, ఈ మెరుపులో 'మనం' ఉండాలి.

మన స్వభావంలో మెరుగులు, మెరుపులు కనిపించాలి.

మన ఆలోచనలే మెరుగులు, మెరుపులు కావాలి.

మన వ్యక్తిత్వమే మెరుగైన వర్తనం అయితీరాలి ... మెరుపులా మెరియాలి.

ఆ మెరుపు చిరకాలమే అయినా అచిరకాలం ప్రభావం చూపాలి.

ఈ మెరుగుకోసం, ఈ మెరుపుకోసం మనం మారవలసిందే! మారి తీరవలసిందే!!

ఎలా? ఎలా? ఎలా?

అంటే - ఇలా -

జీవితాన్ని అర్థం చేసుకోవటం ఆరంభిస్తే సక్సెస్.

ప్రపంచాన్ని పరిశీలించటం ప్రారంభిస్తే సక్సెస్.

జీవితమూ, ప్రపంచమూ మనకు కావాలనిపిస్తే సక్సెస్.
ఇంతకీ ఇలా మారటం అన్నది మరింత ఎదగటం కోసం ... మరింత పరిణతి కోసం ... మరింత ఉన్నతి కోసం ... మరింతగా అర్థవంతంగా జీవించటం కోసం. నిజానికి వ్యక్తిగతంగా ఎదగటం కోసం మారతాం ... సామాజికంగా గుర్తింపు కోసం మారతాం ... కుటుంబ వాతావరణంలో ఇమడటానికి మారతాం ... వృత్తిపరంగా రాణించటానికి మారతాం ... ప్రవృత్తిపరంగా పరిణతి చెందటానికి మారతాం. ఇలా మారుతూ మారుతూ మనల్ని మనమే మరచిపోయేంతగా మారతాం. అలా మారుతూ మారుతూ మైమరచినపుడు జీవితం కుదిపినట్టయి మేల్కొంటాం ... ఆ మేల్కొల్పుతో 'ఔట్‌సైర్‌'గా మారుతూ వచ్చిన మనం మళ్లీ 'ఇన్‌సైడర్‌'గా మారటానికి సిద్ధమవుతాం

Write a review

Note: HTML is not translated!
Bad           Good