ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు చదివిన ఫెరారీని అమ్మిన యోగి రచనల క్రమంలో తెలుసుకో నీ గమ్యాన్ని కూడా స్ఫూర్తినిచ్చే కథలా ఉన్న రచన. డన్ శాండర్సన్ అమితమైన ఎగ్జిక్యూటివ్. పైకి ఎన్నో సాధించినట్లుగా కనిపించినా సతోషం, జీవితానికి అర్ధం, ....శాంతి లోపించిన మనిషి.
శాశ్వతమైన సఫలతా రహస్యాలను కనుగొన్న ప్రసిద్ధ సన్యాసి జూలియన్ మాండిల్ని అనుకోకుండా కలుసుకోవడంతో, డన్ అసాధారణ ప్రయాణం కొనసాగిస్తూ తన విలువైన ఆత్మను, తాను కలగన్న జీవితాన్ని సాక్షాత్కరింపజేసు కోవాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో మనిషి మ¬న్నత జీవితాన్ని గడపడానికి, ప్రపంచంలో పేరు తెచ్చుకొనడానికి సాయపడే ఏడు పాఠాలను నేర్చుకుంటాడు.
మరిచిపోలేని ఈ కథలో మీరు నేర్చుఒనేవి:
నియంత్రణనువదిలి, అపరిమితమైన మీ సామర్ధ్యాన్ని నమ్మడం ఎలాగో,
ఆత్మవంచన నేరానికి పాల్పడకుండా, గొప్పగా జీవించడం ఎలాగో,
ఉన్నతస్ధాయిలలో స్వయం గురత్వానికి విద్యార్ధి మనస్తత్వంతో ప్రవర్తించడం ఎలాగో,
మీ ఆత్మతపనను, జీవిత గమ్యాన్ని కనుగొనడం ఎలాగో,
మిమ్మల్ని పరీక్షించే సంఘటనలో మీకు సఫలతనందించేవిగా చేసుకోవడం ఎలాగో,
మీ సంపూర్ణ సామర్ధ్యాన్ని జాగృతం చేయడం ఎలాగో తెలుసుకుంటారు. ప్రపంచంలో ఈనాడు అత్యధిక సంఖ్యాకులు రాబిన్‌శర్మ రచనలను చదువుతున్నారు.