నేటి బాలలే రేపటి పౌరులు. మనం సాధారణంగా పిల్లలను, పెద్దలను, వారి పనులను, భావాలను విమర్శిస్తూ ఉంటాం. కాని, వారు ఆ విధంగా తయారగుటకు ఏ పరిస్థితులు కారణమో ఆలోచించం. పుట్టిన పాపలు దాదాపు ఇరవై సంవత్సరాలు పెరిగి పెద్దవారై ఒక ప్రత్యేకత నేర్పరచుకొంటారు. కావున ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే; పుట్టినప్పటి నుండి వారి పెరుగుదల, ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, పరిసరాల ప్రభావం, మొదలగువానిని గురించి తెలుసుకోవాలి. అంటే పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులు కాబోయే విద్యార్థులకు, డాక్టర్లకు, నర్సులకు, సంఘ సేవకులకు, ఎక్కువగా తల్లిదండ్రులకు అవసరం. ఈ క్రింది అధ్యాయాల్లో పిల్లల పుట్టుకనుండి యుక్తవయస్సు వరకు, వారి మనస్తత్వాలను, పెరుగుదలను, ఆరోగ్యాన్ని, విద్యను గురించి కొంతవరకు చెప్పటానికి ప్రయత్నిస్తాను.  తెలుగులో ఇటువంటి విషయాలను గూర్చి చర్చించే పుస్తకాలు చాలా తక్కువ. దాదాపు లేవనే చెప్పవచ్చు. ఈ విషయంలో పాశ్చాత్య దేవాల్లోని శాస్త్రజ్ఞులు చేస్తున్న కృషి అద్వితీయం. మన కృషి మాత్రం చాలా స్వల్పం. - రచయిత

పేజీలు : 125

Write a review

Note: HTML is not translated!
Bad           Good