ప్రశాంతత, ఆనందం అనేవి అనుకున్నంత మాత్రాన అంత సులువుగా లభించవు. అవి లభించాలంటే, మన ఇతర సాధనాలు, మంచిపనులు, సానుకూల దృక్పథం, అలవాట్ల మార్పు కావాలి. వీటి బైప్రోడక్టులే ప్రశాంతత, ఆనందం. ధాన్యం మరలో వేస్తే మంచి బియ్యంతోపాటు, చిట్టూ, తవుడూ వచ్చినట్లుగానే, ''ఒత్తిడి'' అనే ధాన్యాన్ని ''మర'' అనే మనసులో వేసి సాధన చేస్తే మంచి బియ్యంలాంటి ఆరోగ్యం లభిస్తుంది.


ఒత్తిడి అనేది మనలో ప్రేరణ కలిగిస్తుంది కాబట్టి ఇది అందరికీ అవసరమే, అయితే తగిన మోతాదులో ఉండేట్లు మీరు నిర్వహణ చేసుకోవాలి. ఒకప్పుడు ప్రపంచంలో అధిక మరణాలకు కారణం క్యాన్సరు, ఎయిడ్స్‌ వ్యాధులైతే, ఇప్పుడు ఒత్తిడి వాటికన్నా ఎక్కువయింది. ఆ జబ్బులకు మందులున్నాయి, కానీ ఒత్తిడి సమస్య ఏ రూపంలో నైనా ఇబ్బంది పెట్టవచ్చు; అందుకే ముందు జాగ్రత్తగా ఈ పుస్తకంలో ఎన్నో చిట్కాలు, సలహాలు, ప్రవర్తన, మార్పులు, బిహేవియర్‌ మోడిఫికేషన్‌, చిన్న చిన్న వ్యాయామాలు అందించడం జరిగింది.


ఈ పుస్తకంలో అందించిన చిట్కాలు, అనుసరించదగ్గవే, ఆచరణీయమైనవే. సమయం, సందర్భం, వయసు ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఎవరికి వీలైనవి వారు ఆచరించండి. నేను గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హిప్నాటిజం శిక్షణా తరగతులు, వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, విద్యాసంస్థల్లో నిర్వహించిన ''స్ట్రెస్‌ మేనేజిమెంటు'' కార్యక్రమాల అనుభవంలో తెలుసుకున్న ప్రక్రియలు ఇందులో అందిస్తున్నాను. - బి.వి.పట్టాభిరామ్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good