జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు.

భయాందోళనలకు ఎందుకు లోనవుతారు? వీటిని అధిగమించడమెలా? ప్రశాంతంగా వుండటం ఎలా సాధ్యపడుతుంది? మాంధ్యానికి ఎందుకు లోనవుతుంటారు? వీటిని నివారించడమెలా? చెప్పిన మాటలే చెబుతూ, చేసిన పనే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తుంటారు? భ్రమలలో మునిగి తేలుతూ అదే వాస్తవం అన్నట్లు ఎందుకు ప్రవర్తిస్తుంటారు? ఎవరు, ఏ కారణాల వలన మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసలవుతుంటారు? వీటి నుండి విముక్తి పొందటమెలా? కొందరు ఎలా సంఘ వ్యతిరేక శక్తులుగా, నేరస్తులుగా రూపొందుతారు? అందరిలో అతి సహజంగా కలిగే అభద్రతా భయం, ఆందోళన, అపరాధభావన కొందరిలో ఎప్పుడు, ఎందువలన, ఎలా తారాస్ధాయికి చేరుకొంటాయి? మొత్తం ఆలోచనలనే శాసిస్తూ విపరీత ప్రవర్తనకు, మనోరుగ్మతలకు ఎలా త్రోవతీస్తాయి? అపసవ్య ఆలోచనల నుండి ఆత్మహత్యల వరకు మనోవైపరీతాలను నివారించుకోగల సమగ్ర అవగాహనను సంపాదించే తొలి తెలుగు గ్రంథం ''మానసిక ఆరోగ్యం''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good