మనిషి జీవితంలో నిద్ర, అందులో కలలు ఒక భాగం. మీ కలల్లో మంచీ, చెడు రెండూ ఉంటాయి. చెడు కల వచ్చినప్పుడు ‘‘ఛీ! పాడు కల’’ అని కలవర పడతారు, నొచ్చుకుంటారు. కలల మర్మం తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పటి వరకూ మార్కెట్టులో మీకు దొరికేది ఫ్రాయిడ్ మూసలో సాగే పాత చింతకాయ కబుర్లే. కలల మీద అనేక ఆధునిక పరిశోధనలు కొత్త సంగతుల్ని చెబుతున్నా, అవి గ్రంథాల్లోనే మిగిలి పోతున్నాయి తప్ప, జనంలోకి రావటం లేదు. ఆ లోటును ఈ పుస్తకం తీరుస్తుంది.
ఇప్పటి వరకూ కలల పట్ల జనంలో ఉన్న సాంప్రదాయ బావాలను ఈ పుస్తకం సమూలంగా తుడిపేస్తుంది. ఆధునిక ఆలోచనలు, పరిశోధనల నేపథ్యంలో కలల గుట్టును లోతుగా, సమగ్రంగా, శాస్త్రీయంగా, సులభశైలిలో రచయిత మీ ముందు ఉంచారు. ఈ పుస్తకం చదివాక మీ కలను మీరే విశ్లేషించుకోగలరు. అంతే కాదు, గట్టిగా పట్టించుకుంటే, కల ఇచ్చే సందేశాన్ని మీరు వాడుకోగలరు కూడా...
పేజీలు : 159