చేతి వ్రాతని బట్టి మనస్తత్వం తెలుసుకునే శాస్త్రం - యండమూరి వీరేంద్రనాథ్‌
''అక్షరాలు నిట్టనిలువుగా వ్రాసేవారు తమ మీద తమకి బాగా కంట్రోల్‌ వున్నవాళ్లై వుంటారు.... కుడివైపునకు అక్షరాలు వంగి వుండేలా వ్రాసేవారు నలుగురిలో బాగా కలిసిపోతారు. ప్రతి విషయంలోనూ ఏక్టీవ్‌పార్ట్‌ తీసుకుంటారు.... ఎడమవైపు అక్షరాలు వంచి వ్రాసేవారు చాలా వరకు అంతర్ముఖులు''.
దస్తూరీని బట్టి వ్యక్తిత్వం గురించీ, మూర్తి మత్వం గురించీ, మనస్తత్వం గురించీ, ఇట్టే చెప్పెయ్యవచ్చునంటున్నారు యండమూరి వీరేంద్రనాథ్‌. చేతి వ్రాతని చూసి మనస్తత్వాన్ని అంచనా వేసే గ్రాఫాలజీని ఆయన వివరణలతో తెలుగులో అందిస్తున్నారు.
-అమ్మాయి చేతి వ్రాతకీ అబ్బాయి చేతి వ్రాతకీ తేడా వుంటుందా ?
-చేతి వ్రాతని బట్టి - వ్రాసే వ్యక్తి మూడ్‌ చెప్పెయ్యొచ్చా?
-వయస్సును బట్టి వ్రాత మారుతుందా ?
-సంతకం బట్టి మనిషిని అంచనా వేయొచ్చా ?
-ఉద్యోగాలకి ఎందుకు సొంత దస్తూరితో అప్లికేషన్లు పూర్తిచేయమంటారు ?
రకరకాల చేతి వ్రాతల్ని బట్టి, వివిధ వ్యక్తుల మానసిక విశ్లేషణా వ్యక్తిత్వ పరిశీలనల గురించి -యండమూరి వీరేంద్రనాథ్‌' అందిస్తూన్న తొలి తెలుగు సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రం- గ్రాఫాలజీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good