ఈ ''యువతరమా మేలుకో''లో నరేష్‌ ఇండియన్‌ మనకు తెలిసిన విషయాలనే ఎంతో అద్భుతంగా మనసుకు హత్తుకునేలా యువతరానికి వారి కర్తవ్యాలను గుర్తు చేస్తూ వారి జీవితాన్ని 'ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి' ఎలా తీసుకెళ్ళాలో 'భగవద్గీతలో భగవానుడు అర్జునికి' చెప్పిన రీతిలో నరేష్‌ ఇండియన్‌ మనకు చెప్పడం జరిగింది. - శ్రీ వి.వి.లక్ష్మీ నారాయణ ఐ.పి.యస్‌.

వ్యక్తిత్త వికాస నిపుణులు, యువ భారతి వ్యవస్ధాపకులు నరేష్‌ ఇండియన్‌ మంచి ఆలోచనలు, సేవాభావం ఉన్న వ్యక్తి. లీడ్‌ ఇండియా ద్వారా సుదర్శన్‌ ఆచార్య గారి నుండి నేర్చుకున్న గొప్ప సిద్ధాంతాలను అతను ఎంతో నేర్పుగా అందరినీ ఆకట్టుకునే విధంగా చెప్పటంలో నేర్పు సంపాదించాడు. నేను అతనితో కలిసి పాఠశాలలు మరియు కళాశాలలు, కార్పోరేట్స్‌లో ట్రైనింగ్‌ంలో పాల్గొన్నప్పుడు నాకు ఒక విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. అతని మాటలను, సందేశాలను అందరూ మెచ్చుకునేవారు, ఆకర్షితులయ్యేవారు. 'యువతరమా మేలుకో'ను అతను అందరికీ ఉపయోగపడే మంచి వ్యక్తిత్తాన్ని నిర్మించే ఆలోచనలను వ్రాశాడని ఖచ్చితంగా చెప్పగలను. - కోటపాటి ప్రభాకర రావు సీనియర్‌ డైరెక్టర్‌ క్యాపిటల్‌, యస్‌ అండ్‌ పి., ఐ.క్యూ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good