చిరునవ్వులు చిందించని వ్యక్తి, బ్యాంక్‌లో తగిన డబ్బున్నా, చేతిలో చెబ్‌బుక్‌ లేనివాడు.

మానవ స్వభావానికి సంబంధించిన సిద్ధాంతాలలో నిష్ణాతులైతే అందరిలాగే వ్యాపారస్తులకు కూడా విజయం సాధ్యం అని ముందుగా యాభై సంవత్సరాల క్రితమే లెస్‌ గిబ్లిన్‌ వివరించాడు. ఈ నిజం ఇప్పటికీ అన్వయిస్తుందని ఎంతోమంది పాఠకులు ఒప్పుకున్నారు.

అన్ని కాలలకూ వర్తించే ఈ పుస్తకంలో, ఆత్మవిశ్వాసశక్తితో వ్యక్తిగత, వ్యాపార, సామాజిక వ్యవహారాలలో విజయం సాధించడానికి సులభమైన సూత్రాలు వున్నాయి. దేహభాషకు సంబంధించిన చిన్న చిట్కాలతో పాటు, మనలో మనకు నమ్మకాన్నిచ్చే సూత్రాలవరకూ వున్నాయి. ఈ పుస్తకం కోరికలను నిజాయితీతో సులభంగా సిద్ధింపచేస్తుంది. లెస్‌ గిబ్లిన్‌, సూత్రీకరణలన్నీ నిరూపితమైనవే. వీటితోపాటు కాస్త లోకజ్ఞానం వుంటే అవి మీకు:

- మానవ స్వభావ సూత్రాలను ఉపయోగించుకుని ఇతరులను ప్రభావితం చేసే విధానాన్ని,

- మీ ప్రవర్తన ద్వారా ఇతరుల వైఖరినీ ఆపేక్షలనూ నియంత్రించే పద్ధతిని.

-  ఇతరులను ఆకర్షించే మూడు ముఖ్యమైన రహస్యాలను కనుగొనడం.

- ఇతరులను కూడా మీ దృష్టి కోణంలోనించీ చూసేలా మలిచే విధాన్ని,

- ఇతరులతో చేసే వ్యవహారాలలో నూతరు శాతం వారి సహకారాన్ని పొందే విధాన్ని నేర్పిస్తాయి.

మీరు ఇప్పటికే సంపాదించిన శక్తితో మీ వ్యక్తిగత, సామాజిక, వ్యాపార సామర్ధ్యాన్ని మరింత పెంపొందించుకోండి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good