ఇప్పటికీ తల్లిదండ్రులుగా మారడం కేవలం యాధృచ్ఛిక సంఘటనగానే పరిగణించటం విస్మయపరిచే విషయమే. పెరుగుతున్న పోటీ, మారుతున్న సామాజిక విలువలు, డాలర్‌ ప్రభావం, సాంకేతిక విప్లవం వెరసి కుటుంబంపై తీవ్ర వత్తిడి.

తల్లిదండ్రుల ప్రవర్తన ఎదుగుతున్న పిల్లల వ్యక్తిత్వాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గొప్ప వ్యక్తులందరు గొప్ప తల్లిదండ్రులు కాలేరు. చరిత్రను చూస్తే మనకు ఇది అవగతమౌతుంది. గొప్ప నాయకుల, శాస్త్రవేత్తల పిల్లల గురించి మనకు ఆనవాళ్ళు కూడా దొరకవు. మంచి తల్లిదండ్రులు కావాలంటే ప్రేమతో పాటు పిల్లల్ని అర్థం చేసుకునే మనస్సు ఉండాలి. మంచి పిల్లలంటే బాగా చదివి ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకునే పిల్లలే కాదనే నిజాన్ని మనం నమ్మాలి-నేటి పిల్లలు మంచి తల్లిదండ్రులు కావాలనుకుంటున్నారు. పిల్లలతో ఎలా వుంటే కుటుంబం అనురాగాలతో రాణించగలదో, పిల్లలు ఎంత ఆత్మవిశ్వాసంతో ఎదగగలరో విపులంగా చర్చించిందీ ఈ పుస్తకం. - డా|| సి.వీరేందర్‌

పేజీలు : 148

Write a review

Note: HTML is not translated!
Bad           Good