మీ జీవతపు 'క్వాలిటీ'ని మెరుగుపరచే అమూల్యమైన పుస్తకం 'టైమ్ మేనేజ్మెంట్'.
టైమ్ మేనేజ్మెంట్ అంటే ఏ పని పడితే ఆ పనిని వేగంగా చేయటం కాదు. దానివల్ల మనకు ఏ ఉపయోగమూ ఉండదు.
టైమ్ మేనేజ్మెంట్ అంటే చేయాల్సిన ముఖ్యమైన పనిని చేయాల్సిన సమయంలోపు పూర్తి చేయటం!
లోకంలో ప్రతి మనిషికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. కాని ఆ 24 గంటల్ని గడిపే తీరులో మనిషికి మనిషికి మధ్య తేడా కనిపిస్తుంది. కొందరికి రోజంతా పనులతో కిక్కిరిసి పోయినట్లుగా అనిపించి ఎంత పని చేసినా తెమలక ఇంకా చేయాల్సింది చాలా ఉండిపోతుంది. ప్రతిరోజూ వాళ్ళు పనితో సతమతమయిపోతూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.మరి కొందరు అంతే పనిని తీరికగా చేసేసుకుంటూ పోయి రోజులో కొంత సమయాన్ని విరామానికి మిగుల్చుకుంటారు. తద్వారా జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు.
ఇందులో మొదటి రకం వాళ్ళు కాలాన్ని మేనేజ్మెంట్ చేయటం (సద్వినియోగం చేయటం) తెలియని వాళ్ళయితే రెండో బాపతు వాళ్ళు కాలాన్ని మేనేజ్ చేయటం తెలిసిన వాళ్ళు!