'ఇందులోని అక్షరాలు మనల్ని కదిలిస్తాయి. కవ్విస్తాయి. ఉత్తేజరుస్తాయి'. - ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా

మీరు ఇంజనీర్‌ లేదా డాక్టర్‌ కావాలనుకోకుండా మరేదయినా చేయదలచుకున్నట్లయితే, ఈ దేశంలో ఒక నేరంగా పరిగణించబడుతుంది.

మీ అంత మీరు సొంతంగా ఏదయినా చేయదలచినట్లయితే, మిమ్మల్ని ఒక ఉగ్రవాదిలా చూస్తారు. అనూ ఆంటీ మా ఇంట్లోకి జొరబడిందంటే నేను సీలింగ్‌ ఫాన్‌ వంక తీక్షణంగా గంటలకొద్దీ చూస్తూ ఉండిపోవలసిందే  అల చేయడంలో నేను మంచి నైపుణ్యాన్ని సాధించగలిగాను.

ఇరవయ్యేళ్ళ పై చిలుకు వయసున్న వరుణ్‌ ఆటల్ని మారుస్తూ, ఆడుకోవాలనే ధోరణితో ఉటాడు. 9-5 గంటల మధ్య ఒక చట్రంలో పని చేయడానికి ఎంతమాత్రం ఇష్టపడడు. వ్యాపారవేత్త కావాలని కలలు కంటాడు. ఇష్టంలేని ఇంజనీరింగ్‌ డిగ్రీని చేతిలో ఉంచుకుని, తన సమయాన్నంతా స్నేహితులతోను, పబ్బుల్లోను కులాసాగా గడపడంతోను, తను మనసుపడ్డ అమ్మాయిని ఫేస్‌బుక్‌లో అనుసరించడంతోను గడిపేస్తుంటాడు. అనూ ఆంటీ రంగంలో ప్రవేశించే వరకూ వరుణ్‌ దినచర్య ఇలాగే ఉండేది. అనూ ఆంటీ తన సుతిమెత్తని సుత్తిదెబ్బల్లాంటి మాటల ఈటెలతో, కొండొకచో పథకాలతో అతగాణ్ణి 'దారి'లోకి తీసుకొచ్చింది.

Pages : 251

Write a review

Note: HTML is not translated!
Bad           Good