విలీ జాలీ ప్రతీ శ్రోతను ఉత్తేజితుడిని చేసి, మరింత పొందేందుకు మరింత కృషి చేసేలా ఒప్పిస్తాడు - జిగ్‌ జగ్లర్‌

ఒక నిమిషం కేటాయించి మీ జీవితాన్ని మార్చుకోండి : మీ జీవితాన్ని మార్చుకోవడానికీ, మీ కలలను సాకారం చేసుకోవడానికీ సిద్ధపడండి. ప్రేరణ శిక్షకుడు విలీ జాలీ, విజయానికి తాళం చెవులూ, మీరు కలలో మాత్రమే చూసిన జీవితంగా మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి పరికరాలూ, మీకు అందిస్తున్నాడు.

ఒక్క నిమిషం మాత్రమే ఎందుకు?

ఎందుకు? ఎందుకంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది. మీ కలలవెంట నడవాలని మీరు నిర్ణయించుకున్న నిమిషం, మీరు మీ జీవితాన్ని మార్చుకునే నిమిషం. విలువైన కాలాన్నీ సద్వినియోగం చేయ్యగల  సామర్ధ్యం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ ఒక రోజులో 1440 నిమిషాలు ఇవ్వబడ్డాయి. కీలకమేమిటంటే ఆ నిమిషాలతో నువ్వు ఏం చేస్తావు అనేది. విలీ జాలీ మీకు విజయసాధనకు ఇంధనాన్ని, ఆహారాన్ని అందివ్వనివ్వండి.

విజయం...

''అపురూమైనది సాధించాలనుకుంటే, అసాధ్యమైనది నువ్వు కలగనాలి. విజయానికి కీలకం గొప్ప కలలు కనడం. ఆ తర్వాత, కల పెద్దదయితే సమస్యలు ప్రతిబంధకం కాదు అని గుర్తించి నీ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి ఆ కలల వెంటపడటం!''

ఛాయిస్‌లు...

''నీకు ఏం సంభవిస్తోంది అన్నది అంత ముఖ్యం కాదు. నీలో ఏం సంభవిస్తోంది అన్నదే ముఖ్యం. జీవితంలో నీకు ఒక ఛాయిస్‌ ఉంది. నువ్వు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ధనికుడిగా ఉండాలని నిర్ణయంచుకోవచ్చు. విజయం అన్నది ఒక ఛాయిస్‌, చాన్సు కాదు!''

మొండిపట్టు...

'జీవితం వద్దు అంటుంది. జనం వద్దు అంటారు. కాని నువ్వు మొండిపట్టుతో ఉన్నట్లయితే, చివరకు జీవితం అవును అనక తప్పదు. మొండిపట్టు ప్రతిఘటనను ముక్కలు చేస్తుంది. ఓడిపోతే కథ ముగియదు. ప్రయత్నం విరమించినప్పుడే ముగుస్తుంది. అందువలన ఎప్పుడూ ప్రయత్నం విరమించకు. మొండిపట్టుతో ఉండు. నీ కలు సాకారం కావడం చూడు.''

''విలీ జాలీ మన జీవితాల గుండా మనల్ని విజయసాధన లోతుల్లోకి తీసుకువెడతాడు.'' - డెన్సిస్‌ కింభ్రో

Write a review

Note: HTML is not translated!
Bad           Good