పరీక్ష : ఈ మూడక్షరాలు వినగానే మనలో చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అప్పటిదాకా లేని భయం ఒక్కసారిగా ఆవహిస్తుంది. బాగా వచ్చిందే అయినా ఒక్క అంశమూ గుర్తుకురాదు. ఏదో ఆందోళన మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అన్నం సయించదు. ఏం చేస్తున్నామో మనకే తెలియదు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మనల్ని గందరగోళానికి గురి చేస్తుంది. ఇదంతా ‘‘పరీక్ష’’ మహిమ. మార్కులు, ర్యాంకుల వేటలో పరీక్ష అనే పేరు వింటేనే వణికి పోయే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే చక్కని ప్రణాళిక, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సహకారం ఉంటే పరీక్ష భయాన్ని పోగొట్టుకుని, విజయ శిఖరాలు అథిరోహించడం ఎంతో సులువు.

ఇటీవలి కాలంలో కాలంలో పరీక్షల భయానికి, ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ తరహా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, అలజడి మరింత ఎక్కువ అవుతునÊవఆనయి. ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ సమస్యలతో కౌన్సిలింగ్‌ నిపుణుల వద్దకు పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. నిశితంగా పరిశీలిస్తే ఈ ఒత్తిడి, అలజడి అంతా ఓ భ్రమ. సరైన మార్గదర్శకత్వం, సహకారం ఉంటే వీటినుంచి బయటపడటం ఎంతో తేలిక...

పేజీలు: 78

Write a review

Note: HTML is not translated!
Bad           Good