జీవితంలో ఏదో సాధించాలని, ఉన్నత స్ధాయికి చేరుకోవాలని ప్రతి మనిషి కలలు కనటం సహజం. అందరిలోనూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, బాగా డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఎన్నో కలలు కంటుంటారు. చాలామంది ఇలాంటి ఊహలతో వృథా కాలక్షేపం చేస్తారు తప్ప ఆ ఊహల్ని, కలల్ని సాకారం చేసుకోవడానికి కనీస ప్రయత్నాలు చేయరు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, తమ జీవితాలను మారుస్తారని చేయూత కోసం చూస్తారు తప్ప, ఏదో ఒక ప్రయత్నం చేసి జీవితంలో స్వయంకృషితో పైకి ఎదగాలని ఆలోచించరు.

ఒక ప్రయత్నం చేసి జీవితంలో స్వయంకృషితో పైకి ఎదగాలని ఆలోచించరు.

ఎవరైనా జీవితంలో ఎదగాలనుకుంటే ఒక చక్కని లైఫ్‌ప్లాన్‌ చేసుకోవాలి. ఎవరూ రారు, ఏమీ చేయరు, తామే అడుగు ముందుకు వేయాలి... అనే స్ధిర సంకల్పాన్ని పెంపొందించుకోవాలి. అత్యున్నత స్ధాయికి ఎదిగిన మహనీయుల, ప్రముఖుల జీవిత గాథల స్ఫూర్తితో విజయం సాధించాలి. ప్రపంచ విజేతగా నిలిచి ముందు తరాల వారికి స్ఫూర్తిగా నిలవాలి. ఈ రోజు మీరు చేస్తున్న పనే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ రోజు మీరు ఎలా గడిపారనే దానిపైన మీ మొత్తం జీవిన విధానం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జీవితకాలం అంతటికీ ఇప్పుడు మీరు గడుపుతున్న రోజులు, గంటలే  సూక్ష్మరూపాలుగా గోచరిస్తాయి. మీరు మాట్లాడే మాటలు, చేసే ఆలోచనలు, తీసుకునే భోజనం, చేస్తున్న పనులు ఇవన్నీ మీ మీరు ఎలా ఉంటారో, ఎలా ఉండబోతున్నారో తెలియజేస్తుంది. అందుకే చెబుతున్నది మొదటి అడుగు వేసేందుకు మంచి ముహూర్తం ఈ రోజే ఉంది. సంసిద్ధులు కండి. సన్నాహాలు చేయండి.

డాక్టర్‌ ఎం.వి.ఆర్‌.రాజు గారు ఒక టర్నింగ్‌ పాయింట్‌ మీ లైఫ్‌లో ఉంటుందని అనేక కోనాల నుంచి విశదీకరించారు.ప ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. మీ టర్నింగ్‌ పాయింట్‌ ఎక్కడో మీకు విశదీకరిస్తుంది ఈ పుస్తకం. అందుకే చదవండి ఈ టర్నింగ్‌ పాయింట్‌. - డాక్టర్ టి.ఎస్‌.రావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good