ప్రి కేజీ నుంచి పి.హెచ్‌.డి. దాకా మన విద్యావిధానంలో ఎలా చదవాలి అన్నదాన్ని గురించి, అభ్యాసానికి (లెర్నింగ్‌కి) మూలమైనజ్ఞాప్తి గురించి ఏ దశలోనూ బోధించటం జరగటం లేదు. ఎవరికివారు ఆ విషయాన్ని ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ (యత్న దోషాల) ద్వారా నేర్చుకోవాల్సిందే.
జ్ఞాపకశక్తి గురించి, చదువుల్లో కౌశల్యం గురించి ఇంగ్లీషులో లభిస్తున్న విస్తృతమైన సమాచారం తెలుగులో కేవలం ఉన్నతస్ధాయి మనోవిజ్ఞాన గ్రంథాలకే పరిమితమైంది. తెలుగు మీడియంలో చదువుకుంటున్న విద్యార్ధులకు, మాతృభాష తెలుగైన వారికి ఉపయోగపడాలనే ఆకాంక్షతో రూపుదిద్దుకున్న ఈ పుస్తకం విద్యార్ధులకు వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు కరదీపిక కాగలదు.
మనోవిజ్ఞాన సంబంధమైన జ్ఞప్తి, పఠన కౌశల్యతా వివరాలతో పాటు పరీక్షల పట్ల చదువుల పట్ల, జీవితం పట్ల విద్యార్ధులకు ఉండవలసిన వైకరుల్ని ఈ పుస్తకం చర్చిస్తుంది.
మీరు చదువుల్లో రాణించాలనుకుంటున్నా, విద్యాపరమైన విషయాల్లో మీరేమనర్నా సమస్యల్ని ఎదుర్కొంటున్నా గానీ ఈ పుస్తకం మీకు మార్గాన్ని చూపగలదు. అన్ని స్ధాయిల్లోని విద్యార్ధులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తప్పక చదవితీరాల్సిన విద్యా వైజ్ఞానిక రచన ఇది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good