గట్టిగా అనుకో అయిపోద్ది...

నిజమే, సంకల్పబలం వుంటే సాధ్యం కానిదేముంది? భారతదేశాన్ని అణుసంపత్తి గల దేశంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కల దేశంగా మార్చింది అబ్దుల్‌ కలాం గారి సంకల్పమే. అదే ఇప్పుడు దేశసంపదగా మారింది. ఈ దేశానికి స్వాతంత్య్రం సాధించాలన్న మహాత్మాగాంధీ ధృఢ సంకల్పమే దేశ మాతను దాస్యశృంఖలాల నుండి విడిపించింది.

బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అణగారిన జాతుల హక్కుల కోసం వజ్రకఠిన దీక్షా దక్షతతో పోరు సల్పిన నేపథ్యంలోనే సామాజిక న్యాయానికి దారులు ఏర్పడ్డాయి. ఇవన్నీ జాతీయస్థాయి ఉదాహరణలు కాగా నేనో ఉదాహరణ చెబుతా సాధన అనే  అమ్మాయి ఒక ఆఫీసులో పని చేసే స్టెనోగ్రాఫర్‌ తన చిన్ననాటి 'కల' ఐ.ఏ.ఎస్‌. ఆఫీసర్‌ కావాలన్నది. వివాహమైంది, కుటుంబ అవసరాల కోసం ఉద్యోగం చేయక తప్పని స్థితి. సాయంత్రం అయ్యేసరికి అలిసిపోయి ఇంటికి వస్తుండడం మళ్లీ పసిబిడ్డ ఆలనా పాలనా ఇన్ని వత్తిళ్ల మధ్య కూడా ఆమె తన కలల సామ్రాజ్యంలో ఈదులాడకుండా వుండడం సాధ్యం కాలేదు. ఆఫీసులో తన టేబుల్‌ పైన సాధన ఐ.ఏ.ఎస్‌. అని వ్రాసుకునేది.

అందరూ నవ్వుకొనే వాళ్ళు. కట్‌ చేస్తే ఆ అమ్మాయి ఐ.ఏ.ఎస్‌. సాధించింది. బలమైన సంకల్పం వుంటే సాధించలేదిని ఏముంది? ఈ దేశాన్ని నడుపుతున్న నరేంద్రమోడి ఒక సాధారణ చాయ్‌ వాలా.

ప్రపంచంలో అత్యున్నత స్థానాల్లోకి చేరిన వారందరి చరిత్ర ఒకటే. దేనినైనా సాధించాలన్న తపన వున్న వాల్ళకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. సాధ్యం కాదనుకున్న తెలంగాణా రాష్ట్రాన్ని కె.సి.ఆర్‌గారు... అహింసాయుత పద్ధతిలో తన వ్యూహాత్మక నైపుణ్యంతో సాధించాడు.

చరిత్ర అంతా అణిచివేత లోంచి వచ్చిన విప్లవ జయకేతనాలే కన్పిస్తూ వుంటాయి.....

పేజీలు : 214

Write a review

Note: HTML is not translated!
Bad           Good