'మీరు ఇందులోని శక్తివంతమైన సిద్ధాంతాలను అనుసరిస్తే ఈ గొప్ప పుస్తకం మీ విజయానికీ ఆనందానికీ ద్వారాలు తెరుస్తుంది.  - ఆగ్‌ మేన్డినో
వివిధ రంగాలలో అత్యధిక సాఫల్యాన్ని సాధించిన వ్యక్తుల ఆలోచనలను, భావాలను ఈ పుస్తకంలో మీరు తెలుసుకోవచ్చు.  వ్యక్తిగత అభ్యున్నతి సాధన కోసం మీలోని సంభావ్యతాశక్తిని వెలికితెచ్చుకోవడం ఎలాగో తెలుసుకుంటారు.  మీరు వెంటనే మరింత పట్టుదలతో మరింత సానుకూల మనస్తత్వంతో చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేస్తారు.  ఈ పుస్తకం ఏ సెమినార్ల ఆధారంగా కూర్చబడిందో ఆ సెమినార్లకు హాజరైన మిలియన్ల మందిలో అనేకమంది తమ ఆదాయమే కాక, వారి జీవన నాణ్యతను కూడా పెంచుకున్నారు. 
విజయానికీ, సాఫల్య సాధనకూ ఈ పుస్తకంలో పేర్కొన్న సిద్ధాంతాలన్నీ మనోవైజ్ఞానిక శాస్త్రం, మతం, తత్వశాస్త్రం, వాణిజ్యం, ఆర్థికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, చరిత్ర, అధిభౌతిక శాస్త్రాలలోనివి...అన్నీ నిరూపితమైనవి.  ఈ ఆలోచనలన్నీ ఒక క్రమంలో కూర్చడం వలన, మీరెన్నడూ ఊహించని విధంగా విజయపథంలో నడిపిస్తాయి.  మీ ఆత్మసమ్మానాన్నీ, సామర్థ్యాన్నీ పెంచి మీ జీవితంలోని అన్ని అంశాలపైన మీకు పూర్తి అదుపు కలుగచేస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good