జీవితం నీటి బుడగంటారు...
క్షణకాలమే దాని బ్రతుకంటారు...
క్షణాల్లో అన్నీ కోల్పోతామని భయపడుతుంటారు ఎందరో...
కానీ, నీటి బుడగ ఎంత అందంగా వుంటుందో..
అది ఎన్ని రంగుల కలబోతో..
ఆకాశం అందుకోవాలని ఎలా పట్టుదలగా పై పైకి వెళుతుందో...
తన ఆయుష్షు విషయం మరిచి, ఎలా స్వేచ్ఛగా,
అందరి మనసుల్ని సంతోషంలో ముంచి, తన ప్రయాణాన్ని
కొనసాగిస్తుందో గమనించం.
జీవితం నీటి బుడగ అనుకునేవారంతా, ఆయుష్షు గురించి
ఆలోచించడం మానేసి, అందాలని, ఆనందాలని చూడండి.
మీ జీవితం రంగులమయంగా కనిపిస్తుంది.
ఎంజాయ్‌ ఎ హ్యాపీ అండ్‌ కలర్‌ఫుల్‌ లైఫ్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good