ఈ పుస్తకంలో మీ సొంత వ్యాపారాన్ని మీరు ఎందుకు నిర్మించుకోవాలనే దాని ఆవశ్యకత గురించే కాక, ఎటువంటి వ్యాపారం మీరు ప్రారంభిస్తే బాగుంటుందో అనే విషయం కూడా రచయిత ఈ పుస్తకంలో మీకు చెప్పబోతున్నారు.  అయితే అది కేవలం మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం మార్చుకోమని చెప్పడం కాదు;  మీరు కూడా మారాలనేదే నా ఉద్దేశం.  అత్యుత్తమమైన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటందుకు మీకు అవసరమైనవి మీరు ఎలా కనుక్కోవాలో రచయిత వివరిస్తారు.  కాని మీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే, మీరు కూడా ఎంతో ఎత్తుకి ఎదగాలి
ఆర్థిక వ్యవస్థ ఇక్కడ సమస్య కాదు.
ఆ సమస్య మీరే.
కార్పొరేట్‌ ప్రపంచంలోని అవినీతి మీద కోపంగా ఉందా?  వాల్‌స్ట్రీట్‌, పెద్ద పెద్ద బ్యాంకుల మీద కోపంగా ఉందా? చేయాల్సిన సరైన పనులు చేయకుండా, చేయకూడని చెడ్డపనులు చేస్తున్న ప్రభుత్వం మీద కోపంగా ఉందా?  లేక, మీ ఆర్థిక పరిస్థితులను అదుపులో ఉంచుకోనందుకు, మీమీదే కోపం కలుగుతోందా?
జీవితం కఠినంగానే ఉంటుంది.  ప్రశ్న ఏమిటంటే - దాని గురించి మీరేం చేయదలుచుకున్నారు?  ఆర్థికవ్యవస్థ గురించి ఏడుస్తూ కూర్చున్నా, లేక ఇతరులను నిందించినంత మాత్రాన మీ ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కలగదు.  మీరు సంపద కావాలనుకుంటే, దానిని మీరు సృష్టించాలి.  మీ ఆర్థిక భవిష్యత్తును మీ చేతుల్లోనే ఉంచుకునే ఆవశ్యకత ఉంది.  దానికోసం మీరు మీ ఆదాయం మూలాన్ని అదుపులోకి తీసుకోవాలి- ఈనాడే!
మీకో సొంత వ్యాపారం ఉండాలి.
అధిక సంఖ్యాకులకు ఆర్థికపరంగా ఇది కష్టకాలం కావచ్చు.  కాని ఎంతోమంది వ్యాపారవేత్తలకు సొంత వ్యాపారం ఏర్పరచుకోవటానికి ఇదే సరైన సమయం.  దీనిని మించిన సమయం ఇంతవరకూ రానేలేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good