ప్రపంచ ప్రసిద్ధి పొందిన మేనేజ్మెంట్ పద్ధతి.
ఇది త్వరితమైంది. ఇది సరళమైంది. ఇది అద్భుతమైంది. ఒక్క నిమిషాన్ని ఫలవంతంగా వినియోగించుకోవడానికి సంబంధించిన మూడు సరళమైన రహస్యాల్ని ఈ పుస్తకం మీకు సుబోధకం చేస్తుంది.
మీ వృత్తిని, జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి!
ఇరవై ఏళ్ళకు పైగా దేశవ్యాప్తంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలకు, ఇతర చిన్నతరహా వానిజ్య సంస్థలకు చెందిన లక్షలాది మంది మేనేజర్లు (కార్యనిర్వహణాధికారులు) 'వన్ మినిట్ మేనేజర్' మెళుకువల్ని పాటించడం ద్వారా తమ సంస్థల ఉత్పాదకతను, వృత్తి జీవితంలో సంతృప్తిని, వ్యక్తిగత అభివృద్ధిని పెంపొందించుకున్నారు. సంస్థకు, దాని ఉద్యోగులకు లాభదాయక ఫలితాల్ని అందించే ఈ మేనేజ్మెంట్ పద్ధతిలోని మెళుకువల్ని అభ్యసించడం ద్వారానే వాళ్ళు ఇంతటి గొప్ప వాస్తవ ఫలితాల్ని సాధించారు.
ఈ వన్ మినిట్ మేనేజర్ సంక్లిష్టమైన, సులభతరమైన కథనంతో కొనసాగి మీకు ముఖ్యమైన మూడు రహస్యాల్ని వివరిస్తుంది, అవి : వన్ మినిట్ (ఒక్క నిమిషం) లక్ష్యాలు, వన్ మినిట్ ప్రశంసలు, వన్ మినిట్ విమర్శలు.
వైద్యం, మానవ ప్రవర్తనాశాస్త్రాలకు సంబంధించిన పలు శాస్త్రీయపరిశోధనల్ని ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. ఇంతటి సరళమైన పద్థతులు ఎందరో వ్యక్తులకు సమర్థవంతంగా సహకరించడంలోని మర్మాన్ని ఆ పరిశోధనలు మీకు వివరిస్తాయి. పుస్తకాన్ని చదవడం ముగించేటప్పటికి మీ పరిస్థితులకు అనుగుణంగా ఆ పద్ధతుల్ని పాటించడమెలాగో, వాటి ప్రయోజనాల్ని చూరగొనడమెలాగో మీకు చక్కగా తెలిసిపోతుంది.