పాఠ్యప్రణాళికలో ప్రాధాన్యం, ప్రస్తుతం మూర్తిమత్వం, నాయకత్వం, కమ్యూనికేషన్‌ ప్రక్రియకు సంబంధించిన బోధన నుంచి ఇతర నైపుణాల్యలతోపాటు స్ధూలమైన ఆ నైపుణ్యాల బోధన దృష్టి కోణం వైపుకు మళ్ళడం ప్రారంభమయింది. ఇది, అభ్యాసకుడు ప్రభావ వంతంగా లేదా సమర్ధంగా అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా వారు, బలహీనమైన లేదా కష్టతరమైన అంశాలను అధిగమించగలిగే పరిహారక సామర్ధ్యాలను వినియోగించ గలుగుతారు. ఈ దృష్టి కోణం ఉపాధ్యాయ-శిక్షణార్ధులకు ఉత్తేజభరితంగానూ, ఛాలెంజింగ్‌గానూ ఉంటుంది. సులభ (సాఫ్ట్‌) నైపుణ్యాలను అర్ధం చేసుకొని, ఆచరించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆ విధంగా అభ్యసన ప్రక్రియలో నిష్క్రియాత్మక (ప్యాసివ్‌) విజ్ఞాన గ్రహీతలను కాకుండా క్రియాత్మక (యాక్షన్‌) భాగస్వాములుగా ఉండటానికి ఈ దృష్టికోణం వీలు కల్పిస్తుంది. ఇదే 'మూర్తిమత్వ వికాసం' అవుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good