మహోన్నత జీవనం 30 రోజుల్లో సాధ్యం

మనందరికీ పరిపూర్ణ జీవనానికి కావాల్సిన నిగూఢశక్తి ఉంది. మనందరికీ గొప్ప విజయాలు సాధించటానికి, ఆనందం, విజయం, పరిపూర్ణ శాంతితో గడపటానికి కావాల్సిన నిగూఢశక్తి ఉంది. మనలో కొంతమందిలో, అది అట్టడుగున నిద్రాణమై ఉంది. దాన్ని తట్టి లేపి, పరీక్షించటానికి ఎదురు చూస్తోంది. మనం చేయాల్సిన అతి ముఖ్యమైన ప్రయత్నం ఈ శక్తిని లేపే స్వయం ఆధిపత్యం, జీవన శ్రేష్ఠత సాధించాలి. ఈ పని చేయటానికి కావాల్సిన ఒకే ఒక్క పరికరం ఈ పుస్తకం.

'ఈ కథ వినండి, హిమాలయ కొండల్లో కొండదారి మీద ఒక అలిసిన ప్రయాణీకుడు తనకు ఎదురైన యోగిని కలిసాడుట. ఆ ప్రయాణీకుడు ఆ వృద్ధ యోగిని తన అంతిమ లక్ష్యమైన కొండ శిఖరం చేరడానికి మార్గమెక్కడ ఉంది అని అడిగాడట. ఆ యోగి ఒక్కక్షణం ఆలోచించి ఇలా చెప్పాడుట. 'నీ ప్రతి ఒక్క అడుగూ కొండ శిఖరంవైపే వేసేలాగా చూసుకో, అప్పుడు అక్కడికి తప్పకుండా చేరుతావు'.

మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి చర్య మీ అంతిమ లక్ష్యం వైపే సాగితే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీకు విజయం ఆనందం కలిగి తీరుతాయి. ఎప్పుడైతే మీరు మీ మనసు, శరీరం, ఆత్మలని పదునుపెట్టారో అప్పుడే మీ జీవితం ఎన్నడూ కనివినీ ఎరుగని ఘనవిజయం సాధిస్తుంది. మీ జీవితాన్ని సారవంతం చేయడానికి కావలసినవన్నీ ఈ పుస్తకం మీకందజేస్తుంది. రాబిన్‌ శరక్మ మెగాలివింగ్‌ ఆఫ్‌ 30 డేస్‌ టు ఎ పర్ఫెక్ట్‌కు తెలుగు అనువాదం మహోన్నత జీవనం! 30 రోజుల్లో సాధ్యం. అనువాదకురాలు - మద్దూరి రాజ్యశ్రీ. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good