ఎందరో ప్రముక నాయకులు, ఉపాధ్యాయులు, మేధావులు, రచయితలు, విజ్ఞానవేత్తలు వారి జీవితానుభవ సారాన్ని ఆర్యోక్తులుగానూ, మరువరాని మాటలుగానూ, సూక్తులుగానూ, హితోక్తులుగానూ చెప్పిన మంచి మాటలను పత్రకల ద్వారా, ఎన్నో పుస్తకాల ద్వారా, వ్యక్తుల ద్వారా సేకరించి సరళమైన భాషలో సులభ శైలిలో ఆకారాది క్రమంలో రెండు భాగాలుగా 1500పైగా సూక్తులను ఈ పుస్తకంలో అందించారు రచయిత పి.రాజేశ్వరరావు గారు. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు మార్గదర్శకాలు. మానసిక ప్రశాంతతకు శాంతి దూతలు. మీ విజయాలకు నిచ్చెనలు. మంచి చెడులను తెలుసుకొని సరైన అవగాహన పెంచుకొని సన్మార్గంలో వెళ్ళేందుకు ఇందులోని సూక్తులు నిస్సందేహంగా ఉపయోగపడతాయి. సమాజంలో మంచిని కోరే వారందరూ ముఖ్యంగా ఉపాధ్యాయులు, నాయకులు, పండితులు, మేధావులు ఈ సూక్తులను వారి ప్రసంగాల ద్వారా వినిపిస్తే సమాజంలో మంచిని పెంచినవారవుతారు.
Rs.40.00
Out Of Stock
-
+