ముఖ్యమైన పనులను ఎక్కువగా చేయండి ఇవాళ!
చేయాల్సిన పనుల పట్టికలో ఉన్న పనులన్నిటినీ చేయటానికి సరిపడా సమయం లేదు. అసలు ఎప్పుడూ ఉండదు. విజేతలు అన్నీ చేయాలని కూడా అనుకోరు. వాళ్ళు అత్యంత ముఖ్యమైన పనుల మీద దృష్టిపెట్టటం నేర్చుకుని, అవి ఖచ్చితంగా జరిగి తీరేటట్టు చూస్తారు.
ఒక పాత సామెత ఉంది. పొద్దున్న లేవగానే ముందుగా ఒక జీవమున్న కప్పని గనుక తింటే మీరు రోజంతటికీ చేసే అత్యంత దారుణమైన పని అదే అని తెలుసుకునే తృప్తి మిగులుతుంది మీకు. 'తినండి ఆ కప్పని' అన్న రూపకాలంకారాన్ని ఉపయోగించారు. మీకు ఆరోజు అతికష్టమైన పనిని చేపట్టటానికి. అది మీరు కాలయాపన చేయటానికి చూసే అవకాశమున్న పని కాని అది చేస్తే బహుళ మీ జీవితం మీద అత్యంత గొప్ప సానుకూల ప్రభావం చూపవచ్చు. అతికష్టమైన పని అన్నిటికన్నా ముందు!. అతి ముఖ్యమైన పనులను ఎలా చేపట్టాలో ప్రతి రోజును ఎలా తీర్చిదిద్దుకోవాలో చూపిస్తుంది. మీరు ఎక్కువ పనిని వేగంగా చేయగలగటమే కాదు, సరియైన పనులను చేయగలుగుతారు.
ముమ్మరంగా అమ్మకాలు సాధించిన బ్రాయన్ ట్రేసీ సమర్ధవంతమైన సమయనియంత్రణకీ అవసరమైన ముఖ్య అంశాలను ఏరారు నిర్ణయం, నియంత్రణ, నిశ్చయం. పూర్తిగా మార్పులూ చేర్పులూ చేయబడిన ఈ కొత్త సంపుటిలో టెక్నాలజీ మీ సమయాన్ని కబళించి వేయకుండా ఉండేందుకు ఏం చేయాలో సరికొత్త పద్ధతిని ఉటంకించారు. ఆయన ఇరవయి ఒక్క ఆచరణియ సూత్రాలను వివరించారు మీరు కాలయాపన చేయటం ఆపి. అత్యంత ముఖ్యమైన పనులను ఎక్కువ చేసేటందుకు వీలుగా, అదీ ఇవాళే.
బ్రాయన్ ట్రేసీ, అమెరికాలో మానవ శక్తి సామర్ధ్యాలను వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. ప్రతి ఏడూ 250000 వ్యక్తులకీ ప్రసంగాలిస్తారు. వ్యక్తిగత, వృత్తిపర సామర్ధ్యం పెంపొందించే అంశాల మీద పేరెన్నికగన్న మాక్సిమమ్ అఛివ్ మెంట్ గోల్స్! ది 100 ఎబ్సల్యూట్లి అన్ బ్రేకబుల్ లాస్ ఆఫ్ బిజినెస్ సక్సెస్ పుస్తకాల రచయిత ట్రేసీ. అవి కాక ఎన్నో అత్యధిక ప్రజాదరణ పొందిన ఆడియో ప్రోగ్రాములు ది సైకాలజీ ఆఫ్ అఛివ్ మెంట్, హౌటుస్టార్ట్ అండ్ సక్సిడ్ ఇన్ యువర్ ఓన్ బిజినెస్ లాంటివి తయారు చేసారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good