ఇది కలల పుస్తకం, కలలు కనడం ఎలాగో, వాటిని నిజం చేసుకోవడం ఎలాగో కల్లాకపటం లేకుండా తెలియజేసే పుస్తకం.

విజయం సాధించడానికి మన కలలు పెద్దవిగానూ, ఊహలు విస్తృతంగానూ, దీక్ష అపరిమితంగానూ ఉండాలి. అప్పుడే కన్న కలలు అసాధ్యంగా కనిపించినప్పటికీ సాధ్యం చేసుకోవడం సులభం.

మనలో చాలామంది అనుకున్నది సాధించలేక, తమ సామర్ధ్యాన్ని బహిర్గతం చేసుకోలేక ఎల్లకాలం అసామాన్యులైనప్పటికీ సామాన్యంగా బ్రతుకు వెళ్ళదీస్తూ ఉంటారు. అలాంటివారికి తమ శక్తియుక్తులపై నమ్మకం కలిగించి వారికి అసాధ్యంగా తోచిన దానిని సుసాధ్యపరచడమే ఈ పుస్తకం పరమావధి.

మీరు ఎల్లప్పుడు విజయపథంలోనే పయనిస్తూ ఉండాలనుకుంటే, ఆనందంగానూ, సంతృప్తిగానూ జీవించాలనుకొంటే, మీ అనుబంధాలను దృఢపరుచుకోవాలనుకొంటే, మీలోని నిగూఢశక్తిని వెలికితీసి 'అద్భుతాలు' చేసి చూపించాలంటే... ఈ పుస్తకం మీ కోసమే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good