''శ్రీరామాంజనేయ'' సంవాదం. ఇది నిజమా ? అని గురువుగార్ని ఒక శిష్యుడు అడుగుతాడు. ''లేదు'' అనేకంటే, అతని అనుమానంలోని ఆంతర్యాన్ని గుర్తిస్తారు.
ఎందుకంటే .. అతనే ''గురువుగారూ! వశిష్టులవారు, రాములవార్కి ''యోగం'' గురించి చెప్పినట్లు విన్నాను. పై కథనమనేసరికి.....ఆలోచించి సమాధానమిస్తారు.
నిజానికిది ''రామాయణ'' కథనం కాదు.
ఆధ్యాత్మిక రామాయణంలోని సంవాదానికి ఆనంద స్వరూపం. పరశురామ పంతుల లింగమూర్తి అను గురుమూర్తిగారు, దీనికి ప్రత్యేక కథనమెక్కడా లేదని, తాను చదివిన ఆధ్యాత్మిక రామాయణానుభూతితో, మదిలో మెదిలిన ఆలోచనల స్వరూపమే, ''శ్రీ సీతారామంజనేయ సంవాద''మని చెబుతారు. దీనికి రచయిత, వ్యాఖ్యాత, ఆనంద బంధువు ''లింగమూర్తి'' గురుమూర్తిగారే, తదనంతరం కాలంలో వజ్ఘల నారాయణ శాస్త్రులుగారు, శ్రీ పరశురామ పంతులుగారి ఆనందానికి, బ్రహ్మానందంగా తమ వ్యాఖ్యానం భక్తజనులకందించారు. ఇది అనగనగనా .... కథ.
ఇప్పటి పాఠకులలో ఆధ్య్మాత్మికతపై ఆలోచన వుంది. భక్తిపై విశ్వాసముంది. దాంతో ఈనాటి భక్తజనులు అర్ధం చేసుకోవాడనికి వీలుగా నన్ను సరళ వచనంలో ఇమ్మన్నారు. అయితే పద్యాలు అలాగే వుంచి, వ్యాఖ్యానమే సరళంగా ఇవ్వండి ''అన్న మా ప్రచరురణ కర్త కోరిక మేరకు వీలయినంత సరళంగా ఇచ్చాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good