సెక్రెటరీ 20 వ శతాబ్దపు బెస్ట్ సెల్లర్ ఏకంగా 75 ముద్రణలు పూర్తీ చేసుకున్న నవల ఇది.  గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు నవలా పాఠక హృదయ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి యద్దనపూడి సులోచనా రాణి . ఆమె తోలి నవలే ఈ సెక్రెటరీ. 1965 లో విడుదలై ఇది సంచలనం సృస్టించింది. శ్రీమతి సులోచనారాణి శైలి అనితర సాధ్యం, అనన్యం . సెక్రెటరీ నవలని గురించి చెప్పుకోవాలంటే, ఇందులో రాజశేఖరం, జయంతి ప్రధాన పాత్రాలు. జయంతి ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల.
రాజశేఖరం కష్టపడి పైకి వచ్చినవాడు . అతడికి జయంతి సెక్రటరీ గా చేరుతుంది. తీరా ఈ జయంతి స్వయానా రాజశేఖరం మామయ్య కూతురే. అయితే స్థితిగతులతో ప్రేమేయం లేకుండా తన వ్యక్తిత్వం చూసి జయంతి ఆకర్షితం కావాలని రాజశేఖరం కోరుకుంటాడు. కానీ అంతలో జయంతికి తోడుగా వుంది అన్ని తెలిసిన బామ్మ చనిపోతుంది. అక్కడి నుంచి కదా మలుపులు తిరిగి చివరకు సుఖాంతం అవుతుంది.
పసిడి అందం ఉంది. పరువానికి వేగం ఉంది.
పసిడి అందాల్ని పరువపు వేగాల్ని
ఏకకాలంలో అనుభవించాలంటే సెక్రెటరీ చదవండి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good