పగలు-రాత్రి, ఆరు రుతువులు, లయబద్ధమైన గ్రహగతులు-

ఇలా గోడగడియారంలా కచ్చితమైన ఆవృత్తి గల విశ్వలయలని ఊహించింది న్యూటోనియస్‌ భౌతికశాస్త్రం. గ్రహాలు సన్నని గోళాలనీ, పర్వతాలు శంకువులనీ, గ్రహ కక్ష్యలు దీర్గవృత్తాలనీ బోధించింది యూక్లిడియన్‌ జ్యామితి. స్ధిరత్వం, ఆవృత్తి అన్న విశ్వాసాలు ఈ సాంప్రదాయక విజ్ఞానానికి పునాదులు.

అయితే ఇరవయ్యవ శతాబ్ధపు రెండవ భాగంలో కొందరు వైజ్ఞానిక విప్లవకారులు ఈ పునాదులను ధ్వంసం చేశారు. ఇందుగలదు అందులేదనలేమంటూ..ప్రకృతిలో అణువణువునా కల్లోలాన్నే దర్శించి ప్రదర్శించారు ఈ చిచ్చరపిడుగులు.  ఆ కల్లోలంలో ఉన్న లయనీ దర్శించారు వీళ్ళు. క్రమం, క్రమరాహిత్యం రెండు ముఖాలుగా గల ఓ విశ్వసత్యం కల్లోలం. 'కల్లోల ప్రపంచం' గ్రంధానికి కొనసాగింపే 'ప్రకృతి జామితి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good