ఆరు నెలల పసి పాప కళ్ళలోని మెరుపును ఏ యాంత్రిక మేధస్సయినా తిరిగి సృష్టించ గలదా? లేదు, అది మానవులకు మాత్రమే సొంతం...
పదార్థం శక్తిక్షేత్రాల మయం. ఒక అణువులో 99.9999 శాతం ఖాళీ ప్రదేశమే. అది శూన్యం కాదు. అందులో అపారమైన శక్తి ఇమిడివుంది. దీనినే జీరో పాయింట్ ఎనర్జీ అంటున్నారు... గ్రహాంతరజీవులతో సంపర్కం గాని ఏర్పడితే, వారికీ మనకూ సమాచార సంపర్కం ఎట్లా ఏర్పడగలదు?....
నాలుగు కంటే ఎక్కువ డైమన్షన్లను ఊహించగలమా? స్థలం కాలంతో కలిపి నాలుగు డైమన్షన్ల విశ్వం మనది. మనం ఐదవ డైమన్షన్లోకి వెళ్ళగలిగితే, మనకి గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకే సారి దర్శనమిస్తాయి.
400 ఏళ్ళతరువాత సైన్స్ అభివృద్ధి ఏవిధంగా వుంటుంది? మానవ సమాజం ఏ రూపం ధరిస్తుంది? నా ఈ సైన్స్ నవలలో ఈ జమిలి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి ప్రయత్నించాను. ఈ రెండు ప్రయత్నాల మేళవింపే ఈ సైన్స్ ఫిక్షన్. ` మర్త విజయ కుమార్
పేజీలు : 144