వ్యవసాయ క్షేత్రంలో ఆపిల్‌ చెట్టుక్రింద, ఆలోచనలలో నిమగ్నమైన న్యూటన్‌ ఆపిల్‌ నేలరాలటం గమనించాడు. వేలాది జనం చెట్టు నుండి ఆపిల్‌ నేలరాలటం గురించి చూసి, విని ఉంటారు. ఎవరూ 'ఎందుకు?' అని ప్రశ్నించలేదు. నేలమీద రాలిన ఆపిల్‌ ఈ విశ్వ గమనాన్ని వివరించే అద్భుత సిద్ధాంతాలకు బీజం పడేలా చేసింది. న్యూటన్‌కు గణితం, ఖగోళం పైన ఎంతో ఆసక్తి. శ్వేతవర్ణం ఒక రంగు కాదని, అది సప్తవర్ణ సమ్మిశ్రితమని, పట్టకాలతో నిరూపించాడు. గ్రహాలు పద్ధతి ప్రకారం సూర్యుడి చుట్టూ తిరగటానికి కారణం 'గురత్వాకర్షణ శక్తి' అని వివరించిన మొదటి శాస్త్రవేత్త న్యూటన్‌. గెలీలియో భావనల్లో రూపుదిద్దుకున్న 'ద్రవ్యరాశి', 'బలం', 'జడత్వం' వంటి శాస్త్ర కన్యకలు న్యూటన్‌ సంరక్షణలో సొగసులు సంతరించుకుని, ఈ అవనిలో ఎంతో పేరొందాడు. 'సర్‌' అనే బిరుదుతో, టంకసాల అధిపతిగా, 'ప్రిన్సిపియా మాధమేటికా' అనే ప్రఖ్యాత గ్రంథ రచయితగా లోకవిదితమే. సమాజ శ్రేయస్సుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి మరువలేనిది. న్యూటన్‌ ప్రతిపాదించిన శాస్త్ర సంగతులు లేకపోతే శాస్త్ర ప్రగతే లేదు. అలాంటి శాస్త్రవేత్త జీవిత చరిత్రను నేటి తరం విద్యార్థులు చదవాలి.

పేజీలు : 45

Write a review

Note: HTML is not translated!
Bad           Good