కాలనిర్ణయాల విషయంలో ప్రాచ్య పండితులకు, ఆధునిక పండితులకు, అనేక అభిప్రాయభేదాలున్నాయి. వాటిలో కొన్ని చోట్ల పురాతన ప్రాచ్యపండితుల అభిప్రాయాలే సత్యసమ్మతాలని కొన్ని సందర్భాలలో ధ్రువపడుతోంది. ఐనప్పటికీ, యీ సంకలనాన్ని చారిత్రకచర్చలకు దూరంగా వుంచటంకోసం, ఆధునిక చరిత్రకారులు నిర్ణయించిన కాలాలనే ఈ సంపుటిలో స్వీకరించటం జరిగింది.

వేదసాహిత్యంలోని రెండవ విజ్ఞాన ఖండం ప్రాయోగిక విజ్ఞానం వంటిది. మన పురాతన వైజ్ఞానిక మహర్షులు తమ విజ్ఞాన పరిశోధనల ఫలితాలను సమాజంలోని అన్ని వర్గాలకూ అందించాలనే సంకల్పంతో, అనేక రకాలయిన ఆచారాలను, అనుష్ఠానాలను, సంప్రదాయాలను, సంబరాలను, ఇలా ఎన్నో ప్రక్రియలను రూపొందించారు. వాటిల్లో అనేక వైజ్ఞానికాంశాలను, ఉత్సవాంశాలను, సమ్మిశ్రితం చేశారు. వాటిని కూడా విశ్లేషించి చూస్తే గానీ, ఆనాటి వైజ్ఞానిక పరిధి విస్తృతి మన అవగాహనలోకి రాదు. ఐతే ఇది కొంతవరకు వ్యాఖ్యానాత్మకంగా వుంటుంది. భారతీయుల పండుగలకు, ఖగోళసన్నివేశాలకు గల సంబంధాలు, ఇత్యాదులు ఈ కోవలోకి చేరుతాయి. అందువల్ల ఇలాంటి అంశాలను యీ సంకలనంలో ఉత్తరార్థంగా సమకూర్చటం జరిగింది.

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good