సాధారణముగా విద్యార్థులకు లెక్కలంటే భయం, తలనొప్పి, ఆసక్తి లేకపోవుట కనిపిస్తుంది. దీనికి కారణం చిన్నతనములో వారి చేత బండగా ఎక్కాలు బట్టీవేయించడం ఒకటి. గణితములో ప్రావీణ్యత కావాలంటే ఎక్కాలు తప్పనిసరి తద్దినం. గణన యంత్రాలను ఉపయోగించుట ద్వారా విద్యార్థులకు ఈ బెడద తప్పించినా వాటిమీద ఆధారపడటం బతుకే అవుతుంది. నిలుచున్న పళంగా ఏదైనా గుణకారము చేయవలసివస్తే ఆగండి, ఆగండి, ప్రస్తుతము నా దగ్గర గణన యంత్రము లేదు. కావున ఇపుడు చేయలేను అనడం సిగ్గుచేటు. అందుచేత ఎక్కాలు బాగారావలసిందే. బాల్య దశలో కొంతవరకు ఎక్కాలను అధ్యయనము చేయించి వాటిని జ్ఞాపకముంచుకొనుటకు కొన్ని మెలకువలు నేర్పినచో మరచిపోవుటకు ఆస్కారముండదు. గణితమన్న ఆసక్తి కలిగి, వారిలో ఉత్సామము పెల్లుబికి గణిత శాస్త్రములో అభిరుచి అలవడుతుంది అని నా అభిప్రాయం.

మౌఖిక గుణకార, బాగహార పద్ధతులు, మరెన్నో సులభ పద్ధతులు అధర్వణ వేదములో రాయబడినవి. వీటిని అధ్యయనము చేసి ప్రప్రథమముగ పూజ్యశ్రీ భారతీకృష్ణతీర్థ శ్రీ పూరీ శంకరాచార్యులువారి ''వేదిక్‌ మ్యాథమ్యాటిక్స్‌'' పుస్తకములో 16 సూత్రాలు వివరించారు. నేను బెనారసు హిందూ యూనివర్సిటీలో ఎమ్మేస్సీ చదివే రోజులలో ఆ పుస్తకాన్ని చదివితిని. అప్పటి నుండి ఉత్తేజితుడనై విద్యార్థులకు ఆసక్తి కలిగించుటకు, సులభ పద్ధతులను అందించుటకు ఉపక్రమించి యీ పుస్తకాన్ని వెలువరించాను. - రచయిత

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good