కాంటీలీవర్‌ వంతెనలు :

ట్రస్‌ వంతెనలతో కూడా మరీ ఎక్కువ పొడవైన వంతెనలు నిర్మించడం సాధ్యం కాదు. వంతెన పొడవు మరింతగా పెంచాలంటే అందుకు మరి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. అలాంటి ఉపాయాలలో మొదటిది కాంటీలీవర్‌ వంతెన.

కాంటీలీవర్‌ కి అతి సామాన్యమైన ఉదాహరణ ఇంట్లో చొక్కాలు పెట్టుకునే కొక్కెం. దాని కొసకి తగిలించిన చొక్కా వేలాడుతూ ఉంటుంది. కొక్కెం కింద పడిపోకుండా దానిని గోడతో కలిపే మేకులు ఆపుతూ ఉంటాయి. అంటే నిజానికి చొక్కా బరువుని కొక్కెం ద్వారా గోడ మోస్తుంది అన్నమాట.

కాంటీలీవర్‌ కి మరో సామాన్యమైన ఉదాహరణ స్విమ్మింగ్‌ పూల్‌ల వద్ద ఉండే స్ప్రింగ్‌ బోర్డులు. ఈ స్ప్రింగ్‌ బోర్డ్‌ అంచున ఈతగాడు నించుని నీట్లోకి దూకుతాడు. బోర్డు కాస్త వంగుతుందేమో గాని విరిగి పడదు. బోర్డు వదలకుండా దాని అవతలి కొసని గోడలోకి కొడతారు. కాబట్టి ఈతగాడి బరువుని ఒక విధంగా స్ప్రింగ్‌ బోర్డు ద్వారా గోడే మోస్తోంది అన్నమాట.

ఆ విధంగా కాంటీలీవర్‌లో సామాన్యంగా ఒక బీమ్‌ యొక్క ఒక కొసని నిశ్చలంగా ఉన్న గోడలోనో, ఒక స్తంభంలోనో స్థిరపరుస్తారు. అవతలి కొస గాల్లో పొడుచుకొస్తూ ఉంటుంది. ఆ అవతలి కొస మీద బరువు పెట్టడం జరుగుతుంది. అలా గాల్లో పొడుచుకొస్తున్న కొస మీద మోపే బరువుని కాంటీలీవర్‌ ద్వారా అవతల నిశ్చలంగా ఉన్న ఆధారం మోస్తూ ఉంటుంది....

పేజీలు : 24

Write a review

Note: HTML is not translated!
Bad           Good