అమ్మా నేను ఎక్కడి నుంచి వచారు ? అని చిన్న పిల్లలు అమాయికంగా తల్లిని అడుగుతారు. ఏమి చెప్పాలో తెలియక తల్లి కూడా అంతే  అమాయికంగా నువ్వు దేవుడి దగ్గరించి వచ్చావు బాబు ! అని సమాధానం చెబుతుంది. తాము ఎక్కి నుంచి వచ్చామో తెలుసుకోవాలన్నా కుతూహలం పిల్లలకే కాదు , పెద్దలకు కూడా వుంటుంది. మానవులు ఎక్కడి నుంచి వచ్చారు ? మానవజాతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలకు మానవులు ఆలోచించడం నేర్చిన నాటి నుంచి అడుగుతూనే వున్నారు. కొన్ని వందల సంవత్సరాల నాడు బయట ఆహారం సేకరించుకుని వృద్ధి చెందగల జీవపదార్ధం ఉత్పన్నమైంది . మొదట ఏకకణ జీవులు రూపంలో ప్రారంభమైంది. పరిణామ క్రమంలో ఏకకణ జీవులు పరివర్తన చెందాయి. ఆ తర్వాత ఇన్ని కోట్ల ఏళ్ళ లోను జీవం ఎన్నో లక్షల అవతారాలేత్తింది. భూమండలం పై అన్ని జీవ జాతులలోకి ఉన్నత మైన స్థాయికి చెందినట్టిది నరావతారం . ప్రస్తుత రూపంలో నరుడు అవతరించడానికి  ముందు ప్రక్రుతి ఎన్నో నరవానర రూపాలలో ఎన్నో ప్రయోగాలు చేసింది. అన్నిటిలోకి హీమో సేపియన్జ్ అనబడే ఈ నాటి నరావతారమే విజయవంత మైంది. ఆ ప్రయోగాలను అంతకుముందటి అసంఖ్యాక జీవజాతుల పరిణామక్రమాన్ని దిజ్మాత్రంగా వివరించడమే ఈ గ్రంధం ఉద్దేశం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good