ఈ పుస్తకం చదివితే ప్రాణికోటిలో జరిగిన పరిణామమూ, మానవుడు సాధిస్తున్న సాంఘిక పరిణామమూ తెలుస్తాయి.

మనకన్న నాగరికతలో చాలా ముందుకుపోయినట్టు భావించబడే పాశ్చాత్యులు పరిణామవాదం ప్రతిపాదించిన డార్విన్‌ ప్రభృతులను తీవ్రంగా ప్రతిఘటించారు.

మన తత్వవేత్తలు కూడా ప్రాణులన్నీ ఒకటేనని సిద్ధాంతీకరించారు. కనీసం ప్రాణులు ఒకే పారంపర్యం గలవి అనేది పరిణామవాదం రుజువు చేస్తున్నది.

ఈనాడు మనం సాంఘిక పరిణామదశలో వున్నాం. గతించిపోయిన జీవరాసులలాగా మనం ప్రకృతిలో పోరాడటం లేదు. జీవశాస్త్ర రీత్యా మానవుడు శీతోష్ణాలను ఏనాడో జయించాడు. తన దైహిక, మానసికావసరాలను తీర్చుకునేశక్తులూ, శాస్త్ర పరిజ్ఞానమూ, సుఖజీవనానికి అవసరమైన పద్ధతులూ ఏనాడో అలవరచుకున్నాడు....

పేజీలు : 63

Write a review

Note: HTML is not translated!
Bad           Good